Akunuri Murali : పేదల పట్ల ద్రోహం కేసీఆర్ మోసం
మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి
Akunuri Murali : మాజీ ఉన్నతాధికారి ఆకునూరి మురళి మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఇందుకు ప్రధానంగా బాధ్యత వహించాల్సింది సీఎం కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేటలో నిర్మించిన పేదల ఇళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ సుమారు వెయ్యి ఇళ్లను నిర్మించారని, వీటిని నిర్మించి కూడా 4 సంవత్సరాలు అవుతోందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు పేదలకు కేటాయించ లేదని ఆరోపించారు. వాళ్లు చేసిన నేరం ఏమిటో చెప్పాలని ఆకునూరి మురళి(Akunuri Murali) సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. తను మాత్రం ఉండేందుకు ఇంధ్ర భవనం లాంటి ప్రగతి భవన్ ను కట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. అందులో 150 గదులు ఉన్నాయని మరి పేదలు బతికేందుకు ఉండ కూడదా అని ప్రశ్నించారు.
తనకు ఓ న్యాయం పేదలకు ఒక న్యాయమా అని నిలదీశారు ఆకునూరి మురళి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇళ్లు పాడు పడి పోయాయని వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆవేదన చెందారు. ఇంకెంత కాలం సొల్లు కబుర్లతో , మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్. కాగా ఆకునూరి మురళి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : దమ్ముంటే రండి కొలువుల లెక్కలు చూపిస్తా