Akunuri Murali Health Director Scam : హెల్త్ డైరెక్టర్ నిర్వాకం ‘ఆకునూరి’ ఆగ్రహం
శ్రీనివాసరావు జారీ చేసిన సర్క్యులర్ పై ఫైర్
Akunuri Murali Health Director Scam : సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్ (ఎస్డీఎఫ్) కన్వీనర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు జారీ చేసిన సర్క్యులర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీలు, ఆస్పత్రులు, వైద్య కళాశాలలో సీఎం బర్త్ డే వేడుకలు జరపాలని, ఈ సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.
దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. తీవ్ర అభ్యంతరం కూడా తెలిపాయి. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ పై మండిపడ్డారు ఆకునూరి మురళి(Akunuri Murali Health Director Scam). రాష్ట్రంలో గాడి తప్పిన పాలనకు, రాచరిక పోకడకు హెల్త్ డైరెక్టర్ జారీ చేసిన సర్క్యులర్ అద్దం పడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
స్వామి భక్తి ఉంటే వెంటనే హెల్త్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆకునూరి మురళి. బీఆర్ఎస్ లో చేరాలని సూచించారు. ఇప్పటికే అవినీతి, అక్రమాలకు పేరొందిన శ్రీనివాసరావు చరిత్ర హీనుడిగా మిగిలి పోతారని పేర్కొన్నారు . ఇలాంటి అధికారులు ఉండబట్టే తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆకునూరి మురళి.
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయనను సీఎం వెనకేసుకు వస్తున్నారంటూ ఆరోపించారు ఎస్డీఎఫ్ చీఫ్.
Also Read : వైఎస్ బిడ్డను దాడి చేస్తే ఊరుకోను – షర్మిల