Abraham Join : హైదరాబాద్ – తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే కీలకమైన నేతలు జంప్ అయ్యారు. తాజాగా ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడం విశేషం.
Abraham Join in Congress
ఎన్నికల వేళ పోలింగ్ జరిగేందుకు కొన్ని రోజులు ఉండగా ఉన్నట్టుండి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహం(Abraham) తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.
జూబ్లీ హిల్స్ లో తనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న సంపత్ కుమార్ తో కలిసి అబ్రహం కు కండువా కప్పారు. ఆయన వెంట అలంపూర్ కు చెందిన కీలకమైన నేతలు కూడా పార్టీలో చేరారు.
ఇదిలా ఉండగా తొలుత అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న చల్లా వెంకట్రామి రెడ్డి చక్రం తిప్పారు. ఆయన అనుచరుడిగా పేరు పొందిన విజయుడికి బీ ఫామ్ ఇచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన అబ్రహం జంప్ అయ్యారు.
Also Read : Minister KTR : ఫేక్ ప్రచారం జర భద్రం