Alka Lamba : పంజాబ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పంజాబ్ లో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయని, వాటిని నియంత్రించలేక పోతోందంటూ ప్రస్తుత మాన్ సర్కార్ పై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆల్కా లాంబా.
పాటియాలా ఘటనలో ఎవరు బాధ్యులన్నది తేల్చాలన్నారు. ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన రాజకీయ ప్రత్యర్థులపై పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఆప్, భారతీయ జనతా పార్టీలు హిందూత్వ వాదాన్ని అమలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఒక పార్టీ కులం, మతం ప్రాతిపదికన రాజకీయం చేస్తుంటే ఆప్ మాత్రం తిరంగా జెండా పేరుతో తెలివైన పాలిటిక్స్ నడుపుతోందంటూ ఆరోపించారు.
ఆప్ కన్వీనర్ పదే పదే తన పాలన గురించి గొప్పలు చెప్పడమే కానీ పాటియాలా ఘటనపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన పంజాబ్ సీఎం పరిస్థితిని సమీక్షించకుండా ఢిల్లీ లో మకాం వేయడం ఎంత వరకు సబబు అని ఆమె నిలదీశారు.
తమ పార్టీ పంజాబ్ లో పవర్ లోకి రావడంతో అరవింద్ కేజ్రీవాల్ తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ గా చేసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా ఢీల్లీ సీఎం పై ప్రేరేపిత ప్రకటన కేసులో సమన్లు అందుకున్న లాంబా (Alka Lamba)రూపనగర్ ల ఓని పంజాబ్ పోలీసుల ముందు హాజరయ్యారు.
పోలీసులు, లా అండ్ ఆర్డర్ తన చేతుల్లో లేనందు వల్ల ఢిల్లీలో తాను ఏమీ చేయలేనంటున్నారని ఇదెక్కడి సర్కార్ అంటూ ప్రశ్నించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు అక్కడ తిష్ట వేసుకుని ఉన్నారని ఆరోపించారు.
Also Read : లౌడ్ స్పీకర్లను తీసేయక పోతే యుద్దమే