Alka Lamba Yogi : యోగి కామెంట్స్ అల్కా లాంబా సీరియస్
ముందు మీ రాష్ట్రంపై ఫోకస్ పెట్టండి
Alka Lamba Yogi : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అల్కా లాంబా షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు(Alka Lamba Yogi) లేదన్నారు. మంగళవారం యోగి చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు. ఇన్నేళ్లుగా పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప మరొకటి కాదన్నారు. ఐదేళ్ల బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు అల్కా లాంబా. ఇదిలా ఉండగా సరిహద్దు భద్రతపై కాంగ్రెస్ పార్టీ రాజీపడి అభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో అడ్డు పడుతోందంటూ ఆరోపించారు సీఎం యోగి ఆదిత్యానాథ్.
దీనిపై స్పందించిన అల్కా లాంబా ఎవరు ఎవరిని అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలుసన్నారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేసిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. ఆచరణకు నోచుకోని హామీలతో ఓట్ల రాజకీయం చేస్తున్నది బీజేపీ కాదా అని నిలదీశారు అల్కా లాంబా.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మీకు దమ్ముంటే ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని , శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తిగా అబద్దాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘనత బీజేపికి దక్కుతుందన్నారు అల్కా లాంబా.
ఇక నుంచి మాట్లాడే ముందు సీఎం యోగి ఆధారాలతో చూసి మాట్లాడాలని హితవు పలికారు. ముందు శాంతి భద్రతలను యూపీలో గాలికి వదిలేసిన సీఎంకు తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు అల్కా లాంబా.
Also Read : జార్ఖండ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు