Rahul Gandhi : దేశంలో మ‌నుషులంతా ఒక్క‌టే – రాహుల్

కుల, మ‌తాలు అత్యంత ప్ర‌మాదం

Rahul Gandhi : ఈ దేశంలో ఉన్న వాళ్లంద‌రికీ బ‌తికే హ‌క్కు ఉంది. కులం, మతం, ప్రాంతం పేరుతో మ‌నుషుల‌ను విడ‌దీయ‌డం వ‌ల్ల ఎన్నో అన‌ర్థాలు క‌లుగుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ.

దేశం అంటే మ‌ట్టి మాత్రమే కాదు మ‌నుషులు కూడా అన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)  ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన భార‌త్ జోడో పాద‌యాత్ర రాజ‌స్థాన్ లో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా చిన్నారులు, పెద్ద‌లు, విద్యార్థినీ విద్యార్థులు, వివిధ రంగాల‌కు చెందిన వారు పెద్ద ఎత్తున రాహుల్ యాత్ర‌లో పాలు పంచుకుంటున్నారు. ఆయ‌న‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లికారు.

దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాల‌ని మ‌రోసారి పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7న త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి భార‌త్ జోడో యాత్ర‌ను ప్రారంభించారు. క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగుతుంది.

150 రోజుల‌కు పైగా కొన‌సాగుతుంది. 3,578 కిలోమీట‌ర్ల‌కు పైగా న‌డిచేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ జోడో యాత్ర త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో ముగిసింది.

ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాష్ట్రంలో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ముస్లిం (మైనార్టీ) మ‌తానికి చెందిన అమ్మాయిలు రాహుల్ గాంధీని(Rahul Gandhi)  క‌లుసుకున్నారు. ఆయ‌నతో క‌లిసి ఫోటో దిగేందుకు పోటీ ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశంలోని ప్ర‌తి ఒక్క‌రు మ‌నుషులేన‌ని పేర్కొన్నారు. ద్వేషం కాదు ప్రేమ‌ను పంచాల‌ని కోరారు రాహుల్ గాంధీ.

Also Read : అమ్మ‌కానికి ఎల్ఐసీ రెడీ

Leave A Reply

Your Email Id will not be published!