Arvind Kejriwal : ఎగ్జిట్ పోల్స్ బక్వాస్ – సీఎం కేజ్రీవాల్
ప్రజలు తప్పని నిరూపిస్తారని కామెంట్
Arvind Kejriwal : గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంప గుత్తగా భారతీయ జనతా పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని ప్రకటించాయి.
కేవలం ఆప్ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని పేర్కొన్నాయి. కాగా ఎంసీడీ ఎన్నికల్లో మాత్రం ఆప్ కు ఛాన్స్ ఉందంటూ వెల్లడించాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మాట్లాడారు. ఆ అంచనాలు తప్పడం ఖాయమన్నారు.
అవన్నీ ముందస్తుగా ఒప్పందం చేసుకున్న ఫలితాలంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ మీడియా ఇలాగే ప్రచారం చేసిందని ఆరోపించారు. కానీ ఊహించని రీతిలో తమ పార్టీ పవర్ లోకి వచ్చిందన్నారు కేజ్రీవాల్. పంజాబ్ రిజల్ట్స్ కూడా ఇక్కడ రిపీట్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు ఆప్ చీఫ్.
ఆ ముందస్తు ప్రకటనలు, ఫలితాలు తప్పని ప్రజలు నిరూపిస్తారని ఆ నమ్మకం తనకు ఉందన్నారు. గత 27 ఏళ్లుగా బీజేపీ గుజరాత్ లో అధికారంలో ఉందని కానీ ఏం చేసిందో ఇప్పటి వరకు చెప్పలేక పోయిందన్నారు. దేశానికి కావాల్సింది విద్య, వైద్యం, న్యాయం, ఉపాధి అని కానీ వీటిని ఏవీ పట్టంచు కోలేదని ఆరోపించారు.
గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తాము సత్తా చాటడం ఖాయమన్నారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : కేంద్ర పాలిత ప్రాంతాలకు పవర్స్ ఉండవు