Akhilesh Yadav : దేశం మొత్తం ఒకే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. యూపీలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్న సమాజ్ వాది పార్టీ చీఫ్,
మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav )ఈసారి తన కెరీర్ లో శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.
తనకు పట్టున్న కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి అతడిపై పడింది.
యాదవులకు కంచు కోటగా పేరుంది మెయిన్ పురి జిల్లా. ఇందులోనే కర్హాల్ ఉంది.
అఖిలేష్ యాదవ్ పై భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ను రంగంలోకి దింపింది.
1992 లో పార్టీ ఆవిర్భావం నుంచి సమాజ్ వాది పార్టీ కర్హల్ నుంచి ఒకే ఒక్క సారి కోల్పోయింది.
కానీ వరుసగా ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతూ వస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో 2017లో జరిగిన ఎన్నికల్లో 59 స్థానాలకు పోలింగ్ జరిగితే ఇందులో 49 స్థానాల్లో బీజేపీ జెండా ఎగుర వేసింది.
సమాజ్ వాది పార్టీ 9 స్థానాల్లో , కాంగ్రెస్ ఒకటి విజయం సాధించింది. బీఎస్పీ అన్నింటిలోనూ చేతులెత్తేసింది. యూపీలో ఎస్పీ చీఫ్ మామ శివ పాల్ సింగ్ యాదవ్ జస్వంత్ నగర్ లో పోటీలో ఉన్నారు.
బీజేపీకి చెందిన సతీష్ మహానా కాన్పూర్ లోని మహారాజ్ పూర్ లో బరిలో నిలిచారు. రాం వీర్ ఉపాధ్యాయ హత్రాస్ లోని సదాబాద్ లో ,
అసిమ్ అరుణ్ కన్నౌజ్ సదర్ లో , కాంగ్రెస్ కు చెందిన లాయిస్ ఖుర్షీద్ సదర్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఇవాళ పంజాబ్ లో 117 సీట్లకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. 2017లో కాంగ్రెస్ 77 స్థానాలు కైవసం చేసుకోగగా ఆప్ 20 సీట్లు, అకాళీదళ్ , బీజేపీ కూటమి 18 సీట్లలో విజయం సాధించింది.
ఈ సారి మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీతో బీజేపీ కలిసి పోటీ చేస్తోంది.
Also Read : కుమార్ విశ్వాస్ కు వై కేటగిరీ భద్రత