Modi : యూపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలను టార్గెట్ చేశారు.
తమకు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదన్నారు. యావత్ భారతమంతా తమ కుటుంబమని స్పష్టం చేశారు. కుల, మతాలను అడ్డం పెట్టుకుని ఎవరు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు.
గతంలో పాలకులు తమ కోసం, తమ వారి కోసం మాత్రమే పని చేశారని ఆరోపించారు. కానీ తాము పవర్ లోకి వచ్చాక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రతి పేద కుటుంబానికి చేరేలా చేశామన్నారు.
యూపీలో మాఫియా రాజ్ నడించిందన్నారు. కానీ యోగి సర్కార్ కొలువు తీరాక నేరస్థులు పేరు చెప్పేందుకే భయ పడేలా చేశారన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు.
తాము ఎక్కడా ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం లేదన్నారు. ఏది చెప్పామో అది చేసి చూపిస్తున్నామని అన్నారు మోదీ(Modi ). విపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు.
కాంగ్రెస్ కుటుంబ పాలన సాగించిందన్నారు. కానీ భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త సైతం ప్రధానమంత్రి కాగలరని అందుకు తానే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.
ఒక నాడు చాయ్ వాలాగా పని చేసిన నేను ఇప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఇది ఒక్క బీజేపీలో సాధ్యమన్నారు. ఇతర పార్టీలు కుటుంబ వారసత్వాన్ని కలిగి ఉన్నాయంటూ మండిపడ్డారు.
ఇవాళ యూపీలోని బారాబాంకి జిల్లాలో చేపట్టిన బీజేపీ భారీ ర్యాలీలో మోదీ పాల్గొన్నారు.
Also Read : మోదీ సర్కార్ పై శివసేన కన్నెర్ర