Bhatti Vikramarka : స్కాంలు త‌ప్ప కొలువులు ఏవీ – భ‌ట్టి

2 ల‌క్ష‌లు ఖాళీలు ఒక్క పోస్టు భ‌ర్తీ లేదు

Bhatti Vikramarka : సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర న‌ల్ల‌గొండ జిల్లాలో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా గౌడ్ లతో పాటు నిరుద్యోగులు భ‌ట్టి విక్ర‌మార్క‌తో క‌లిశారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించారు. రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల ఖాళీలు ఉన్నా ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేయ‌లేద‌ని ఆరోపించారు. బీఆర్ఎస్ పాల‌న‌లో అన్నీ స్కాంలు త‌ప్ప ఒక్క‌టి కూడా అమ‌ల‌వుతున్న దాఖ‌లాలు లేవ‌న్నారు.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ను సైతం భ్ర‌ష్టు ప‌ట్టించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేసిందో, ఎన్ని జాబ్స్ భ‌ర్తీ చేశారో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

నీళ్లు, నిధులు, నియామ‌కాల ప్రాతిప‌దిక‌న ఏర్పాటైన తెలంగాణ‌ను స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. ఇన్నేళ్ల పాటు ఫామ్ హౌస్ లో ప‌డుకున్నాడ‌ని కానీ నిరుద్యోగుల గురించి ఆలోచించ లేద‌ని వాపోయారు.

త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే యూత్ డిక్ల‌రేష‌న్ ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. యువ‌త‌ను కాపాడుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌(Bhatti Vikramarka). రాష్ట్రంలో గోస త‌ప్ప ఇంకేమీ లేద‌న్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. గౌడ‌న్న‌ల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

Also Read : YS Sharmila : కేసీఆర్ రుణ మాఫీ అబ‌ద్దం – వైఎస్ ష‌ర్మిల

Leave A Reply

Your Email Id will not be published!