CM KCR : దేశంలో మిగిలింది రైతుల భూములే

ప్ర‌ధాన మంత్రి మోదీపై కేసీఆర్ క‌న్నెర్ర‌

CM KCR :  సీఎం కేసీఆర్ మ‌రోసారి కేంద్రాన్ని, ప్ర‌ధాన మంత్రి మోదీని(PM Modi) టార్గెట్ చేశారు. ఎవ‌రైనా న‌ష్టాల్లో వ‌స్తే సంస్థ‌ల్ని అమ్ముతారు. కానీ ఈ దేశంలో కొలువుతీరిన బీజేపీ స‌ర్కార్ లాభాల‌లో ఉన్న వాటిని అమ్మ‌కానికి పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

ప్ర‌పంచంలో ఇలాంటి నిర్ణ‌యం ఏ దేశ‌మూ, ఏ ప్ర‌ధాన‌మంత్రి తీసుకోలేద‌న్నారు. సోమ‌వారం నిజామాబాద్ క‌లెక్ట‌రేట్ ను ప్రారంభించారు.

అనంత‌రం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు కేసీఆర్(CM KCR) . ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న మోదీకి త‌గిన గుణ‌పాఠం చెప్పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు.

ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు నిశితంగా గ‌మ‌నించాల‌ని లేక పోతే ఆగ‌మై పోతర‌ని హెచ్చ‌రించారు. దేశానికే త‌ల‌మానికంగా తెలంగాణ మారింద‌ని కానీ దానిని చూసి కేంద్రం, బీజేపీ నేత‌లు త‌ట్టుకోలేక నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ సీఎం మండిప‌డ్డారు.

త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను కేంద్రం కాపీ కొడుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల‌ని సూచించారు.

తెలంగాణ కోసం పోరాటం చేసింది మేమైతే ఇప్పుడు కొంద‌రు ఆ ఉద్య‌మంతో సంబంధం లేని వాళ్లు అవాకులు, చెవాకులు పేలుతున్నారంటూ ఫైర్ అయ్యారు కేసీఆర్(CM KCR) .

సింగూరు కాలువ‌ల్లో నీళ్లు పారాలా లేక మ‌త పిచ్చి మంట‌ల‌తో ర‌క్తం ఏరులై పారాలా మీరే తేల్చుకోండి అంటూ జ‌నానికి హిత‌బోధ చేశారు సీఎం. అన్నీ అమ్ముకుంటూ వ‌స్తున్న మోదీకి ఇక అమ్మాల్సింది ఒక్క రైతుల భూములే మిగిలి ఉన్నాయంటూ స్ప‌ష్టం చేశారు.

దుర్మార్గ‌మైన బీజేపీ ప్ర‌భుత్వాన్ని దేశం నుంచి త‌రిమి కొట్టాల‌ని , ఆనాడే దేశానికి నిజ‌మైన స్వాతంత్రం వ‌చ్చిన‌ట్లు అని చెప్పారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ నుండి ఎగిరేది మ‌న జెండానేన‌ని అన్నారు.

Also Read : బిగ్ బాస్ అదో అనైతిక షో – నారాయ‌ణ

Leave A Reply

Your Email Id will not be published!