Alla Ramakrishna Reddy : షర్మిల వెంట నడుస్తా – ఆళ్ల
మంగళగిరి ఎమ్మెల్యే కామెంట్స్
Alla Ramakrishna Reddy : అమరావతి – ఏపీలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఆసక్తికరంగా మారారు. ఆమె తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండకుండా నిష్క్రమించారు.
Alla Ramakrishna Reddy Comment
ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో షర్మిలకు ఎంపీ లేదా పార్టీలో కీలక పోస్టు ఇస్తామని ఏఐసీసీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
దీంతో ఈ మధ్యన ఏపీ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఎంపిక చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో వైసీపీకి సంబంధించి నేతలు పలువురు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందని ఆ పార్టీ భావిస్తోంది.
ఇదిలా ఉండగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(Alla Ramakrishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల తోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆమె రాజకీయాలపై నిర్ణయం ప్రకటించిన వెంటనే తాను తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని అన్నారు . నా నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వాపోయారు.
రాజకీయాల్లో ఉన్నా లేక పోయినా చంద్రబాబు, లోకేష్ పై కేసులు వేస్తానని హెచ్చరించరాఉ. అవసరమైతే జగన్ పై కూడా కేసు నమోదు చేసేందుకు వెనుకాడ బోమంటూ పేర్కొన్నారు.
Also Read : Somireddy : కాకాణి తిన్నదంతా కక్కిస్తాం