Nitish Kumar : బీజేపీతో పొత్తు ఓ మూర్ఖత్వం – నితీశ్ కుమార్
నా నవ్వు వెనుక మర్మం ఏమిటంటే
Nitish Kumar : జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన చిరునవ్వు వెనుక ఉన్న రహస్యం ఏమీ లేదన్నారు. భారతీయ జనతా పార్టీతో గత 17 ఏళ్లుగా ఉన్న బంధాన్ని తెంచుకున్నారు.
ఇటీవలే కొత్త సర్కార్ ను ఏర్పాటు చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్, తదితర పార్టీలతో కలిసి 31 మందితో కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేశారు. తేజస్వి యాదవ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.
మరో వైపు మణిపూర్ జేడీయూకు చెందిన 7 మంది ఎమ్మెల్యేలలో 5 మంది ఎమ్మెల్యేలు నితీశ్ కుమార్ కు(Nitish Kumar) షాక్ ఇచ్చారు. బీజేపీలోకి జంప్ అయ్యారు. ఇది ఒకరకంగా షాక్ . కానీ దానిని ఆయన పట్టించు కోలేదు.
బీజేపీతో ఇంత కాలం సాగించిన పొత్తు ఓ మూర్ఖత్వంగా కొట్టి పారేశారు. పాట్నాలో జరిగిన జేడీయూ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం నితీశ్ కుమార్ ప్రసంగించారు. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
2013 లో విడి పోయాక బీజేపీలో మళ్లీ పొత్తు పెట్టుకోవడం పొరపాటేనని ఒప్పుకున్నారు. మేం ఎన్డీఏ నుండి వైదొలిగాం. 2017లో తప్పు చేశాం. వెనక్కి వెళ్లి పోయాం. దాని కారణంగా రాష్ట్రాల్లో ప్రజలు మా నుండి విడి పోయారంటూ చెప్పారు నితీశ్ కుమార్.
మళ్లీ వారితో విడి పోయాలని నిర్ణయం తీసుకున్న నిర్ణయం పెద్ద తప్పుడు నిర్ణయమేనంటూ పేర్కొన్నారు. 2015లో అన్ని పార్టీలు భారీ విజయం సాధించాయి.
రెండేళ్ల తర్వాత అవినీతి ఆరోపణల నేపథ్యంలో అప్పటి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో తెగదెంపులు చేసుకున్నారు. చివరకు మళ్లీ తేజస్వితో నితీష్ కుమార్ బంధం నెలకొల్పారు.
Also Read : బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోంది