Devendra Fadnavis : త్వరలోనే శాఖల కేటాయింపు – ఫడ్నవీస్
ముందు జాతీయ జెండాలు ఎగుర వేయండి
Devendra Fadnavis : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) సంచలన కామెంట్స్ చేశారు. 40 రోజుల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారు. సీఎంగా షిండే, ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ కోలువు తీరాక కేబినెట్ ను విస్తరించారు.
షిండే వర్గం నుంచి , ఫడ్నవీస్ పార్టీ నుంచి మంత్రులు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు శాఖలు కేటాయించలేదు. దీనిపై శనివారం స్పందించారు డిప్యూటీ సీఎం.
నెల రోజులయ్యాక కూడా ఇంకా పోర్ట్ ఫోలియోలు ఎందుకు కేటాయించ లేదంటూ విమర్శలు వచ్చాయి. ఈ వారం ప్రారంభంలో 18 మందిని చేర్చుకున్నారు కేబినెట్ లో. దీని గురించి పదే పదే ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఫడ్నవీస్.
మీరు గాలి పటాలు ఎగుర వేయడంలో బిజీగా ఉండండి. మేము శాఖలను కేటాయిస్తామని చెప్పారు. అది త్వరలోనే పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు.
ఇక శివసేన పార్టీకి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది సీరియస్ కామెంట్స్ చేశారు. ఇన్ని రోజులైనా ఈరోజు వరకు మంత్రులకు శాఖలు ఎందుకు కేటాయించ లేదంటూ ప్రశ్నించారు.
దీనిపై తీవ్రంగా మండిపడ్డారు దేవేంద్ర ఫడ్నవీస్. ప్రియాంక చతుర్వేది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. తాము రాజ్యాంగ బద్దంగానే కొలువు తీరామని ఎంపీ తెలుసుకుంటే మంచిదని సూచించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
మంత్రులుగా ప్రమాణం చేయని ఎమ్మెల్యేలు కోపంగా ఉన్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఇప్పటికీ శాఖలు లేవు. తొందరపడి తిరుగుబాటు చేయండి. తీరిక సమయంలో పశ్చాత పడండి అని ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు.
Also Read : సోనియా గాంధీకి మరోసారి కరోనా