Allu Arjun : హైదరాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన శ్రీ భగవద్ రామానుజాచార్యుల సమతామూర్తి సమతాకేంద్రం భక్తులతో అలరారుతోంది. సహస్రాబ్ది మహోత్సవాలలో భాగంగా ప్రముఖులు దర్శనం కోసం క్యూ కట్టారు.
పుష్పతో వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిన టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) శ్రీరామనగరంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ యాగశాలతో పాటు సమతామూర్తిని దర్శించుకున్నారు.
ఆలయ విశిష్టతల గురించి అడిగి తెలుసుకున్నారు. రామానుజుడు ఆనాటి కాలంలో చేసిన మంచి పనుల గురించి ఆచార్యులు వివరించారు. బన్నీ ప్రత్యేక పూజలు చేశారు.
108 దివ్య ఆలయాలను కూడా దర్శించు కోవడం విశేషం. రుత్వికులు 216 అడుగుల సమతామూర్తి విగ్రహం విశిష్టతల గురించి వివరించారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు.
ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యజ్ఞ క్రతువులను దగ్గరుండి చూశారు. అనంతరం జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు అందుకున్నారు.
సమతామూర్తిని దర్శించు కోవడం తన జీవితంలో మరిచి పోలేని సన్నివేశంగా మిగిలి పోతుందన్నారు అల్లు అర్జున్(Allu Arjun). ఆలయంలో ఉన్నంత సేపు ఎనలేని సంతోషానికి లోనైనట్లు తెలిపారు.
మరో వైపు ఐకాన్ స్టార్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు, అభిమానులు పోటీ పడ్డారు. ఇదిలా ఉండగా రూ. 1000 కోట్ల ఖర్చుతో శ్రీ రామానుజుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 100 ఎకరాలలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈనెల 2న మహోత్సవాలు ప్రారంభమై ఈనెల 14 వరకు కొనసాగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 5న సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Also Read : చిన్నజీయర్ ప్రయత్నం గొప్పది