Allu Sneha Reddy Wishes : ఎవరీ అల్లు స్నేహా రెడ్డి అనుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోడలు. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కు సతీమణి. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన నటుడు రామ్ చరణ్ తేజ్ , ఉపాసనా రెడ్డికి సంబంధించి పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అల్లు స్నేహా రెడ్డి, అల్లు అర్జున్ చెర్రీ, ఉప్సీలకు విషెస్ చెప్పారు. ఈ సందర్బంగా కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి(Allu Sneha Reddy).
ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఉపాసన ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్నారు. ఇక రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారి పోయారు. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందింది. ఆ సినిమాకు సంబంధించి నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది.
సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా రామ్ చరణ్ తేజ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో చెర్రీ, ఉపాసనా కామినేని పాల్గొన్నారు. వీరికి ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఆతిథ్యం కూడా ఇచ్చారు. గతంలో ప్రియాంక , రామ్ చరణ్ తేజ్ కలిసి ఓ చిత్రంలో నటించారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ తమ తనయుడు, కోడలు ఉపాసనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా మెగా ఫ్యామిలీ మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
Also Read : Tirumala : పోటెత్తిన భక్తజనం గోవింద నామ స్మరణం