YS Jagan : మన్నెం వీరుడు జనం మరువని యోధుడు – జగన్
అల్లూరి జయంతి వేడుకల్లో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి
YS Jagan : మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు మరువని యోధుడని కొనియాడారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. భీమవరం అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పీఎం ఆవిష్కరించారు. మన్నెం వీరుడు మహా అగ్ని కణం కొనియాడారు.
తెలుగు గడ్డపై అల్లూరి పుట్టడం గర్వకారణమని జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) చెప్పారు. దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహించు కుంటున్నామని అన్నారు సీఎం.
విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎంకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన గవర్నర్ విశ్వ భూషణ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రివర్గ సహచరులు, సోదరుడు చిరంజీవికి, ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు జగన్.
ఈ గడ్డమీద ఎందరో బలిదానాలు చేశారని అన్నారు. స్వాతంత్రం కోసం పోరాడారని ప్రశంసించారు. తమ రక్తాన్ని ధారపోసి మన దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయులను ఇవాళ తలుచు కుంటున్నామని చెప్పారు సీఎం.
జాతీయ ఉద్యమంలో 1757 నుండి 1947 సంవత్సరాల దాకా 190 ఏళ్ల పాటు వేలాది మంది బలిదానాలు, త్యాగాలు చేశారని అన్నారు. ఈ రాష్ట్రం నుండి ఎందరో పోరాడారని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.
పోరాట యోధాలలో అల్లూరి సీతారామ రాజు ఒక అగ్ని కణం అన్నారు. అడవిలో అగ్గి పుట్టించిన యోధుడని కొనియాడారు సీఎం.
Also Read : తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి – మోది