Alok Mohan DG IGP : క‌ర్ణాట‌క పోలీస్ బాస్ గా అలోక్ మోహ‌న్

డీకే శివ‌కుమార్ ను కలిసిన డీఐజీ

Alok Mohan DG IGP : క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో పోలీస్ బాస్ కూడా మారి పోయారు. ఇక్క‌డ డీజీపీగా(DG IGP) ఉన్న ప్ర‌వీణ్ సూద్ కు ప‌దోన్న‌తి ల‌భించింది. ఆయ‌న‌ను కేంద్రం ప్ర‌తిప‌క్ష నేత‌, సీజేఐ , ప్ర‌ధాని తో కూడిన క‌మిటీ చేసిన సిఫార‌సు మేర‌కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. దీంతో ఆయ‌న స్థానంలో అలోక్ మోహ‌న్(Alok Mohan) ను పోలీస్ బాస్ గా నియ‌మించింది క‌ర్ణాట‌క స‌ర్కార్.

మే 22న రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌వీణ్ సూద్ ప‌ద‌వి నుంచి రిలీవ్ అవుతున్న‌ట్లు నోటిఫికేష‌న్ లో పేర్కొంది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర నూత‌న డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ గా డాక్ట‌ర్ అలోక్ మోహ‌న్ ను నియ‌మిస్తున్న‌ట్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆయ‌న రాష్ట్ర డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ , హోంగార్డ్స్ గా నియ‌మించింది.

క‌ర్ణాట‌క కేడ‌ర్ కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డాక్ట‌ర్ అలోక్ మోహ‌న్. అగ్నిమాప‌క ద‌ళం, అత్య‌వ‌స‌ర సేవ‌ల డీజీపీగా సేవ‌లు అందించారు. వివిధ పాత్ర‌ల్లో 36 ఏళ్ల అనుభవం క‌లిగి ఉన్నారు. జైళ్ల శాఖ‌కు డీజీపీగా, బెంగ‌ళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ క‌మిష‌న‌ర్ , ఏసీబీ ఏడీజీపీ వంటి ప‌ద‌వులు చేప‌ట్టారు. ఆయ‌న డీజీపీ ప‌ద‌వి నుండి ఏప్రిల్ , 2025లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందుతారు.

Also Read : Arvind kejriwal

Leave A Reply

Your Email Id will not be published!