Shashi Tharoor : పార్టీలో జనాదరణ సూపర్ – శశి థరూర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో ఎంపీ
Shashi Tharoor : కాంగ్రెస పార్టీలో అధ్యక్ష పదవి ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఇప్పటికే తేదీ ఖరారు కావడం. ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. వారిలో ఒకరు మల్లికార్జున్ ఖర్గే కాగా మరొకరు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor). ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉండగా శశి థరూర్ కేవలం తనంతకు తానుగా ప్రచారంలో మునిగి పోయారు.
ఆయన ఎక్కడికి వెళ్లినా జనం ఆదరిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా పేరు పొందారు శశి థరూర్. ఆయన మేధావుల్లో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. అరుదైన రచయితగా గుర్తింపు ఉంది. ఈ సమయంలో శశి థరూర్ వర్సస్ ఖర్గే గా మారిన ఈ పార్టీ చీఫ్ ఎన్నిక ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
పార్టీలో కలకలం రేపింది. దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో ముందంజలో ఉన్నారు. గురువారం శశి థరూర్ కేరళలో మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా సీనియర్లు, వృద్దుల కంటే యువతే తనను ఎక్కువగా ఆదరిస్తోందని చెప్పారు. ఇది ఒకందుకు తనను విస్తు పోయేలా చేసిందన్నారు.
పార్టీ గతంలో లాగా ఉండాలని అనుకుంటే ఖర్గేను ఎన్ను కోవాలని లేకుంటే సంస్కరణలు, మార్పులు కావాలని కోరుకుంటే తనను ఎన్ను కోవాలని అన్నారు శశి థరూర్. పార్టీలో హై కమాండ్ కల్చర్ లేకుండా చేస్తానని ప్రకటించారు ఎంపీ.
కాగా పార్టీలో ఎవరు గెలుపొందుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 19న ఎవరు గెలుస్తారో తేలుతుంది.
Also Read : ఎల్జీ ప్రేమ లేఖలు తట్టుకోలేక పోతున్నా