Pawan Kalyan : ఏపీకి అమ‌రావ‌తి రాజ‌ధాని – ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేనాని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ కళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వారాహి ప్ర‌చార యాత్ర‌లో భాగంగా క‌త్తిపూడిలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజ‌ధాని అని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. మూడు రాజ‌ధానుల పేరుతో రాజ‌కీయం చేస్తున్న వాళ్ల‌కు రాబోయే ఎన్నిక‌ల్లో గ‌ట్టిగా బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని , ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని అన్నారు. ఎస్సీలు, బీసీలు, కాపుల‌ను ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌మ్మించి మోసం చేశారంటూ ఆరోపించారు జ‌న‌సేనాని. వైసీపీ పాల‌న‌లో స్వంత సామాజిక వ‌ర్గానికి త‌ప్ప ఇత‌ర వ‌ర్గాల‌కు ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan).

సంప‌ద‌ను సృష్టించడం వాటిని ప్ర‌జ‌ల‌కు పంచ‌డం జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తి కుల రాజ‌ధాని అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న వారికి విప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎందుకు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని నిల‌దీశారు జ‌న‌సేన పార్టీ చీఫ్‌. రాష్ట్రంలో ల‌క్ష‌లాది మంది యువ‌తీ యువ‌కులు నిరుద్యోగులుగా ఉన్నార‌ని వారంద‌రికీ త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేలా శిక్ష‌ణ ఇప్పించి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. కేవ‌లం ఓట్ల కోసం రాజ‌కీయం చేసుకున్న వాళ్ల‌కు తాము అర్థం కామ‌న్నారు.

Also Read : Pawan Kalyan : ఏపీకి అమ‌రావ‌తి రాజ‌ధాని – ప‌వ‌న్ క‌ళ్యాణ్

Leave A Reply

Your Email Id will not be published!