Amazon Lay Offs : నిన్న ట్విట్టర్..మెటా..నేడు అమెజాన్
10 వేల మంది ఉద్యోగులకు చెక్
Amazon Lay Offs : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాడో ఆనాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. వస్తూనే ట్విట్టర్ టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించాడు. ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇదే సమయంలో 7,500 మంది ఉద్యోగులకు గాను 3,978 మందిని తొలగించాడు.
ఆపై వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఒప్పుకోనని ప్రకటించాడు. ఆపై ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా ట్విట్టర్ ఆఫీసులకు రావాల్సిందేనని ఇమెయిల్స్ ద్వారా తెలియ చేశాడు. ఇదే సమయంలో మెటా-ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకెర్ బర్గ్ సంచలన ప్రకటన చేశాడు. ఏకంగా 11,000 వేల మందిని తొలగించాడు.
ఇప్పటికే ఇండియా హెడ్స్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొందని , దీనిని దృష్టిలో పెట్టుకుని పలువురు ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు పేర్కొంటున్నాయి ప్రముఖ కంపెనీలు. ఈ తరుణంలో ప్రముఖ దిగ్గజ అమెరికన్(Amazon Lay Offs) కంపెనీ అమెజాన్ సంచలన ప్రకటన చేసింది.
ట్విట్టర్, మెటా బాట లోనే సంస్థలో పని చేస్తున్న 10,000 వేల మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. కార్పొరేట్, టెక్నాలజీ, తదితర రంగాల్లో పని చేస్తున్న వారిని తొలగించనున్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. మొత్తం ఉద్యోగాలలో 3 శాతానికి పైగా జాబర్స్ ను తొలగించనున్నట్లు సమాచారం.
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ అవకాశం ఇచ్చాయి పలు కంపెనీలు. కానీ సీన్ మారింది. రష్యా, ఉక్రెయిన్ వార్ ప్రభావం ఆయా కంపెనీలపై ప్రభావం చూపాయి.
Also Read : ఉద్యోగాల కోతకు గూగుల్ రెడీ