Anushka Sharma : ‘అనుష్క’తో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ బిగ్ డీల్
వెబ్ సీరీస్, సీరియల్స్ , మూవీస్ కోసం రూ. 400 కోట్లు
Anushka Sharma : భారత దేశ సినీ చరిత్రలో ఇది ఊహించని డీల్ గా పేర్కొనవచ్చు. కరోనా దెబ్బకు అటు ఫార్మా ఇటు ఓటీటీ రంగాలు కోట్లు కురిపిస్తున్నాయి నిర్వాహకులకు.
ప్రస్తుతం అమెజాన్, నెట్ ఫ్లిక్స్ , డిస్నీ హాట్ స్టార్, తదితర దిగ్గజ సంస్థలన్నీ ఓటీటీ ప్లాట్ ఫారమ్ తో దుమ్ము రేపుతున్నాయి. కోట్లాది జనాల్ని కట్టి పడేస్తున్నాయి.
ఈ రంగం ఇప్పుడు ముట్టుకుంటే కోట్లు అన్నట్టుగా తయారైంది. తాజాగా అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ సంస్థలు ఏకంగా భారత్ కు చెందిన అనుష్క ప్రొడక్షన్(Anushka Sharma) తో ఏకంగా రూ. 400 కోట్ల డీల్ కుదుర్చున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదే గనుక నిజమైతే బిగ్గెస్ట్ డీల్ గా ఓటీటీ చరిత్రలో నిలిచి పోక తప్పదు. వినోదం, శృంగారం మేళవించి వెబ్ సీరీస్ , ప్రోగ్రామ్స్ దుమ్ము రేపుతున్నాయి. కాసుల పంట పండిస్తున్నాయి.
దీంతో థియేటర్లకు వెళ్లి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని జనం ఇంటి వద్ద నుంచే ఎంచక్కా ఓటీటీ ప్లాట్ ఫారమ్ లను ఆశ్రయిస్తున్నారు.
తాజాగా నందమూరి నట సింహం నటించిన అఖండ ఓవర్ ఆల్ గా రూ. 200 కోట్ల వసూలు చేసి రికార్డు సృష్టించింది. డిస్నీ హాట్ స్టార్ లో స్టీమింగ్ అయిన ఫస్ట్ డే ఏకంగా 10 లక్షల మంది వీక్షించినట్లు హాట్ స్టార్ వెల్లడించింది.
ఇది కూడా ఓ రికార్డే. ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్వహిస్తున్న ప్రొడక్షన్ హౌజ్ క్లీన్ స్లేట్ ఫిల్మ్ జ్ తో ఈ రెండు ఓటీటీ సంస్థలు ఒప్పందం చేసుకోవడం విశేషం. వెబ్ సీరీస్ ల కోం 54 మిలియన్ డాలర్ల తో ఒప్పందం చేసుకున్నట్లు టాక్.
Also Read : అశ్విన్ అద్భుతమైన బౌలర్ – వార్న్