Amazon Prime Video : ఓటీటీ ప్లాట్ ఫాంలు ఇపుడు డామినేట్ చేస్తున్నాయి. డిజిటల్ టెక్నాలజీ స్పీడప్ అవుతోంది. ప్రతి కంపెనీ వినియోగదారులను టార్గెట్ చేస్తోంది. తాజాగా అమెజాన్ కంపెనీ ప్రైమ్ వీడియో తన కస్టమర్లకు తీపి కబురు చెప్పింది. ప్రైమ్ వీడియో ప్లాట్ ఫాంపై మొదటి సారిగా మొబైల్ ఓన్లీ పేరుతో ప్లాన్ ను తీసుకు వచ్చింది. ఓవర్ ద టాప్ ఆఫ్ ఫ్లాట్ ఫామ్స్ మధ్య తీవ్ర పోటీ ఉంటోంది. ఈ కొత్త స్ట్రాటజీతో యూజర్లను ఆకర్షించాలని అమెజాన్ భావిస్తోంది. ఆ దిశగా ఆదాయాన్నిపెంచు కోవచ్చని ఆశిస్తోంది.
ఇప్పటి దాకా అమెజాన్ తో మరో అమెరికన్ కంపెనీ నెట్ ఫ్లిక్స్ పోటీ పడుతోంది. ఓటీటీ సెక్టార్ లో నువ్వా నేనా అన్న రీతిలో రెండూ సై అంటున్నాయి. అంతకు ముందు నెట్ ఫ్లిక్స్ తన మొబైల్ ప్లాన్ ను నెలకు 199 రపాయల ధరతో విడుదల చేసింది. దీని నుంచి తమ యూజర్లు వెళ్లకుండా ఉండేందుకు అమెజాన్ ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఇండియాలో జియోతో పోటీ పడుతున్న ఎయిర్ టెల్ భాగస్వామ్యంతో ఈ న్యూ ప్లాన్ ను లాంఛ్ చేసింది.
ఇదే ప్లాన్ కు సంబంధించి ప్రీపెయిడ్ ఎయిర్ టెల్ యూజర్లకు తొలి 30 రోజులు ఉచితంగా ట్రయల్ చేసుకునే వీలు కల్పించింది. ఆ తర్వాత 28 డేస్‌కు 89 రూపాయలు వసూలు చేస్తారు. ఈ సేవలన్నీ మొబైల్‌లో అందుబాటులో ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. ఇదే ప్లాన్ తో పాటు 6 జిబి డేటా కూడా యూజ్ చేసుకునే సదుపాయం ఉంది. 28 రోజుల పాటు వాడుకోవచ్చన్న మాట. మొబైల్ డేటా సేవలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్లాన్లు తీసుకు వచ్చామని అమెజాన్ ప్రైమ్ వీడియో వరల్డ్ వైడ్ వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు.
No comment allowed please