Ambati Ram Babu : లోకేష్..ఏడిస్తే సింపతీ రాదు
మంత్రి అంబటి రాంబాబు ఫైర్
Ambati Ram Babu : అమరావతి – ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను, ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరూ దొంగలేనని ఎద్దేవా చేశారు. ఓ వైపు తన భార్య భువనేశ్వరిని తిట్టక పోయినా తిట్టామంటూ దొంగ ఏడ్పు ఏడ్చాడని కానీ జనం నమ్మ లేదన్నారు. ఏడ్పు అనేది సహజంగా ఉండాలని కానీ తెచ్చి పెట్టుకున్న కన్నీళ్లు అంతగా ప్రజల హృదయాలను తాకబోవన్నారు అంబటి రాంబాబు.
Ambati Ram Babu Slams Chandrababu
అయినా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఓట్లు వస్తాయని అనుకోవడం భ్రమ తప్ప ఇంకోటి కాదన్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ సినిమాలలో ఉండాల్సిన వాళ్లని కానీ పోయి పోయి రాజకీయాల్లోకి వచ్చారని మండిపడ్డారు. నారా లోకేష్ తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఏడ్వడం చూస్తే విడ్డూరంగా ఉందన్నారు మంత్రి.
ఏడ్చే మగాళ్లను నమ్మ కూడదని గతంలో పెద్దలు చెప్పారని ఇప్పుడు ఇద్దరూ గజ దొంగలు ఏడుస్తూ ఓట్లు పొందాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబుకు చిప్పకూడే గతి అని స్పష్టంచేశారు అంబటి రాంబాబు(Ambati Ram Babu). ఇప్పటికే కోట్లు కొల్లగొట్టారని ఇక ఏ ముఖం పెట్టుకుని జనంలోకి వెళతారంటూ నిప్పులు చెరిగారు.
Also Read : Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి యాత్ర షురూ