Ambati Ram Babu : బాబు లేఖకు అంబటి కౌంటర్
ఏం ఉద్దరించారో చెప్పాలని ప్రశ్న
Ambati Ram Babu : గుంటూరు – ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Ram Babu) నిప్పులు చెరిగారు. జైలు నుంచి చంద్రబాబు నాయుడు లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆ లేఖలో అన్నీ అబద్దాలే ఉన్నాయని భూతద్దం పెట్టి చూసినా ఒక్క అక్షరం నిజానికి సంబంధించి లేదని పేర్కొన్నారు.
Ambati Ram Babu Serious Comments on Chandrababu
45 రోజుల జైలు జీవితంలో కనీసం కొంతైనా మార్పు వస్తుందని అనుకున్నానని కానీ ఎలాంటి మార్పు రాలేదన్నారు. జైలు నుంచి రాశానని తెలిపారు. కానీ ఆయనకు తెలియదు 17(ఎ) ప్రోటోకాల్ ను అతిక్రమించానని అంటూ మండిపడ్డారు. మీరు రాసిన ఉత్తరంలో అన్నీ అబద్దాలు తప్ప నిజాలు లేవని ఎద్దేవా చేశారు.
జైలులో లేనంటూ పేర్కొన్నారు. అయితే క్వాష్ , బెయిల్ పిటిషన్లు ఆపేయని సూచించారు. ప్రజల గుండెల్లో ఉన్నానని పేర్కొన్నారు..పోనీ మీ పేరు చెబితే గుర్తుకు వచ్చే ఓ నాలుగు స్కీంల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.
ప్రజా చైతన్యం ఎగిసి పడుతోందని అన్నారు..ఆ చైతన్యం ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. తెలుగు ప్రజల అభివృద్ది అంటే ఏమిటో చెప్పాలన్నారు. హైదరాబాద్ మెట్రోలో నల్ల చొక్కాలు వేసుకున్న ఆ నలుగురా.. అమెరికాలో, బ్రిటన్లో, మీ దోపిడీ సొమ్ములతో స్థిర పడిన మీ బంధుగణాలా, ఎన్టీఆర్ను మీరు వెన్నుపోటు పొడవటంలో సహకరించిన మీ మీడియా మిత్రులా అని నిలదీశారు.
బీజేపీలో ఉన్న మీ బంధువులా? కాంగ్రెస్లోకి పంపించిన మీ మనుషులా? కొద్ది మంది వామపక్షాల నాయకుల్లో ప్రవహిస్తున్న మీ పసుపు రక్తమా? ఎవరు తెలుగు ప్రజలంటే అన్నది దయచేసి తెలియ జేయండి.
Also Read : Peddireddy Ramachandra Reddy : 26 నుండి వైసీపీ బస్సు యాత్ర