Ambati Rambabu : చంద్రబాబు జీవితం అవినీతిమయం
ఏపీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్
Ambati Rambabu : విజయవాడ – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఆయన జీవితం మొత్తం అవినీతిమయమని ఆరోపించారు. అంబటి రాంబాబు(Ambati Rambabu) సోమవారం మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ వచ్చాడని ఇప్పటి వరకు , కానీ సీన్ రివర్స్ అయ్యిందన్నారు.
Ambati Rambabu Slams Chandrababu
నిన్నటి వరకు ఆధారాలు దొరకకుండా ప్రయత్నాలు చేశారని , కానీ ప్రస్తుతం అది వర్కవుట్ కాలేదన్నారు. ఏపీ సీఐడీ చాప కింద నీరులా పక్కా ఆధారాలను సేకరించిందని స్పష్టం చేశారు. 25 పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించిందన్నారు. కోట్లు వెచ్చించి ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకు వచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు అంబటి రాంబాబు.
కోర్టు సరైన నిర్ణయం తీసుకుందన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలకు పవన్ కళ్యాణ్ ఎలా సమర్థిస్తాడని ప్రశ్నించారు మంత్రి. బాబు అరెస్ట్ తో టీడీపీ లబ్ది పొందాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
కోర్టు రిమాండ్ విధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలా బంద్ కు పిలుపు ఇస్తుందని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడి పీకల లోతు కూరుకు పోయిన చంద్రబాబు నాయుడుకు ఎలా మద్దతు ఇస్తున్నావంటూ పవన్ ను కడిగి పారేశారు అంబటి రాంబాబు.
నీ పార్టీని బలోపేతం చేసుకోకుండా టీడీపీని ఎందుకు మోస్తున్నావంటూ నిలదీశారు. అచ్చెన్నాయుడు పిలుపునిచ్చినా ఒక్కరు కూడా బయటకు రాలేదన్నారు.
Also Read : Gudivada Amarnath : చంద్రబాబు చట్టానికి అతీతుడు కాదు
