Ambati Rambabu : హలో ‘బ్రో’ ఏమై పోయావ్
పవన్ పై అంబటి సెటైర్
Ambati Rambabu : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ తో సముద్ర ఖని బ్రో పేరుతో సినిమా తీశాడు.
Ambati Rambabu Slams Pawan Kalyan
దీంతో పవన్ కళ్యాణ్ ను అంబటి రాంబాబు(Ambati Rambabu) డియర్ బ్రో అంటూ సంబోదిస్తూ ఎద్దేవా చేశాడు. టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళో రేపో తనను అరెస్ట్ చేస్తారంటూ వాపోతున్నాడు. బొక్కలోకి పోతానని అంటున్న మీ బాబు గురించి ఏం మాట్లాడటం లేదు ఎందుకని అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు అంబటి రాంబాబు.
ఎక్కడున్నావ్ పవన్ కళ్యాణ్ వచ్చి పలకరించి పోతే బాగుంటుంది కదా అంటూ హితవు పలికారు మంత్రి. ఇదే సమయంలో ఓ కవిత కూడా రాశారు మంత్రి. బాబు బస్సు ఎక్కాడు. పప్పు పుత్రుడు రోడ్డు ఎక్కాడు. దత్త పుత్రుడు లారీ ఎక్కాడు..కానీ ఎవరు ఎన్ని ఎక్కినా గద్దెను మాత్రం ఎక్కడం అసాధ్యమని స్పష్టం చస్త్రశాడు అంబటి రాంబాబు.
ఇదిలా ఉండగా రూ. 118 కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వలేదంటూ ఐటీ శాఖ సీరియస్ అయ్యింది చంద్రబాబు నాయుడుపై. ఈ మేరకు దీనికి సంబంధించి మాట్లాడకుండా జగన్ పుట్టుక గురించి మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు మంత్రి.
Also Read : YS Sharmila : హోంగార్డు చావుకు సర్కార్ దే బాధ్యత