Ambati Rambabu : ప‌వ‌న్ బ్రో మూవీ అట్ట‌ర్ ప్లాప్ – అంబ‌టి

నిన్న‌టి దాకా రూ. 2.3 కోట్లు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్

Ambati Rambabu : ఏపీలో రాజ‌కీయాలు సినిమాల దాకా వెళ్లాయి. నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబును ప‌రోక్షంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్రో మూవీలో శ్యాంబాబు పేరుతో సెటైర్ వేయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించారు. నాలుగు రోజుల్లోనే రూ. 107 కోట్లు బ్రో ది వారియ‌ర్ చిత్రం క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టిందంటూ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Ambati Rambabu Comments

అయితే బ్రో క‌లెక్ష‌న్స్ అన్నీ ఫేక్ అని, ఆ సినిమా ఆడ‌డం లేద‌ని, ప‌వ‌న్ కళ్యాణ్ మేనియా ప‌ని చేయ‌లేదంటూ ఎద్దేవా చేశారు మంత్రి అంబ‌టి రాంబాబు(Ambati Rambabu). మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేవ‌లం ఇప్ప‌టి వ‌ర‌కు బ్రో ది వారియార్ చిత్రం రూ. 2.3 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింద‌ని ఏకంగా మంత్రి ప్ర‌క‌టించ‌డం విశేషం.

వ‌సూళ్ల విష‌యంలో అన్నీ అబ‌ద్దాలు చెప్పారంటూ మండిప‌డ్డారు అంబ‌టి రాంబాబు. ఆ సినిమా పూర్తిగా అట్ట‌ర్ ప్లాట్ అంటూ పేర్కొన్నారు. త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు, జ‌న‌సేన పార్టీకి న‌ష్ట‌మేన‌ని కానీ త‌న‌కు ఏమీ కాద‌న్నారు అంబ‌టి రాంబాబు.

ఏయే ఏరియాల్లో ఎంతెంత బ్రో క‌లెక్ష‌న్లు వ‌చ్చాయో ద‌మ్ముంటే బ‌హిరంగంగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు మంత్రి. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Vijayasai Reddy : స‌హకార సంఘాల్లో భారీ అవినీతి

Leave A Reply

Your Email Id will not be published!