Ambati Rambabu : పవన్ రాజకీయ విటుడివా..బ్రోకర్‌వా
మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్
Ambati Rambabu : తాడేపల్లి గూడెం – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu). పవన్ నువ్వు రాజకీయ విటుడివా లేక బ్రోకర్ వా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ రాజకీయ వ్యభిచారం ఎందుకు చేస్తున్నావంటూ సూటిగా ప్రశ్నించారు.
Ambati Rambabu Slams Pawan Kalyan
తెలంగాణలో బీజేపీతో , ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పొదుర్చుకుని ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నావో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ బోట్ల దగ్ధం సంఘటనలో మూడు రోజుల్లో పరిహారం అందించడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఏ ఆపద వచ్చినా జగన్ అండగా నిలుస్తారని అన్నారు. సాయం పేరుతో ప్రచారం చేసుకోవడం పవన్ కళ్యాణ్ కు చెల్లిందంటూ సెటైర్ వేశారు. నువ్వు ఇచ్చిన రూ. 50 వేలు నువ్వు తీసుకున్న ప్యాకేజీలోని సొమ్మేగా అని అన్నారు అంబటి రాంబాబు.
ఆయన పీకే కాదు చంద్రబాబు కోసం పని చేసే కిరాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఫైర్ అయ్యారు. వంగవీటి రంగాను అతి దారుణంగా హత్య చేసిన చంద్రబాబుకు నువ్వు ఎలా మద్దతు పలుకుతావంటూ నిలదీశారు.
యువ గళం కాదది కామెడీ గళం అంటూ నారా లోకేష్ ను ఏకి పారేశారు మంత్రి అంబటి రాంబాబు.
Also Read : PM Modi : శ్రీవారి సన్నిధిలో మోదీ