Ambati Rambabu Pawan Kalyan : జనసేనానిపై అంబటి ఫైర్
ఏపీ మంత్రి అంబటి రాంబాబు
Ambati Rambabu Pawan Kalyan : ఏపీ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. సీఎం సందింటి జగన్ రెడ్డిపై నోరు పారేసుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. వ్యక్తిగత కామెంట్స్ చేయడం అలవాటుగా మారిందన్నారు. జగన్ గురించి మాట్లాడే నైతికత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. మూడు ముక్కల మంత్రి అని పేర్కొన్నాడని తప్పు పట్టారు అంబటి రాంబాబు(Ambati Rambabu) .
మూడు ముక్కలు సరే మూడు ముళ్ల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు ఉందా ప్రశ్నించారు. రాష్ట్రంలో యువతను చెడగొట్టేందుకు కంకణం కట్టుకున్నాడని, చంద్రబాబు నాయుడి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పని చేస్తున్నాడంటూ ఆరోపించారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ కు ఆరాటం తప్ప పోరాటం లేదన్నారు.
ఎంత సేపు ఎవరు ప్యాకేజీ ఇస్తే వారి పాట పాడటం అలవాటుగా మారిందంటూ ఆరోపించారు అంబటి రాంబాబు. ప్యాకేజీ మీద ఆయన రాజకీయాలు ఆధారపడి ఉంటాయని ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి. పవన్ కళ్యాణ్ వల్ల ఏపీకి నష్టం తప్ప లాభం ఏమాత్రం లేదన్నారు.
యువత జాగ్రత్తగా ఉండాలని, సినిమాలు వేరు రాజకీయాలు వేరన్నారు. పొద్దస్తమానం జగన్ రెడ్డిని ఆడి పోసుకోవడం తప్ప ఏపీ రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి ఏమైనా చేశారా అంటూ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పూటకో మాట మాట్లాడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు అంబటి రాంబాబు.
Also Read : నా ముందు జగన్ ఓ లెక్కా – పవన్