Ambati Rambabu : పవన్ కళ్యాణ్ ఏకపత్నీవ్రతుడు
ఏపీ మంత్రి అంబటి రాంబాబు
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు రెచ్చి పోయారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను అన్న మాటలకు ఆయన ఊగి పోయారని, ఒకానొక సమయంలో తుళ్లి పడ బోయారంటూ ఎద్దేవా చేశారు. అంతలా ఊగి పోవడానికి గల కారణం ఏమిటో పవన్ కే తెలియాలని అన్నారు. ఉన్న మాట అంటే ఉలుకు ఎందుకంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు.
ఇక నుంచి తాను పవన్ కళ్యాణ్ చేసుకున్న ఆ పెళ్లిళ్ల గురించి మాట్లాడనని అన్నారు. కానీ ఆయనకు సరైన పదం మాత్రం ఒక్కటి ఉందన్నారు. అదే పవన్ కళ్యాణ్ ఏకపత్నీవ్రతుడు అని తాను పిలుస్తున్నానని పేర్కొన్నారు అంబటి రాంబాబు(Ambati Rambabu). తనకు తెలిసి ఈ పదం పవన్ కు బాగుంటుందన్నారు.
పదే పదే తమ నాయకుడు సీఎం జగన్ రెడ్డిపై, తమ మంత్రులు, ఎమ్మెల్యేలపై నోరు పారేసుకుంటూ తనను తాను తగ్గించుకుంటున్నాడని మండిపడ్డారు. జగన్ సూర్యుడు లాంటోడని , ఆయన దమ్మున్న లీడర్ అని చెప్పారు. నాయకులు జనంలోంచి రావాలని , కానీ సినిమాలలో ఊహించుకుంటే కాలేరంటూ స్పష్టం చేశారు అంబటి రాంబాబు.
ఇకనైనా నోరు జారేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. ఇక నుంచి స్థాయికి తగిన విధంగా మాట్లాడటం నేర్చుకుంటే బెటర్ అని సూచించారు మంత్రి.
Also Read : Smriti Irani Jaiswal : జైస్వాల్ ఆటకు స్మృతీ ఇరానీ ఫిదా