Ambati Rayudu : రోహిత్ శర్మ ను చెన్నై లో చూడాలని ఉంది..ముంబై మేనేజ్మెంట్ ఆలోచించాలి

@ఈ ఏడాది కెప్టెన్‌గా రోహిత్‌నే కొనసాగాలి..' వచ్చే ఏడాది హార్దిక్‌కి బాధ్యతలు అప్పగించాల్సింది

Ambati Rayudu : ముంబై ఇండియన్స్ బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మను కోల్పోయింది ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది. ముంబయి జట్టుకు ఎన్నో టైటిళ్లు అందించిన రోహిత్‌ను ముంబయి జట్టు లీడర్‌గా ఉంచి, హార్దిక్ పాండ్యాను ముంబై జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. ఇది వివాదానికి కారణమైంది. తాజాగా ఈ వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు స్పందించాడు. రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Ambati Rayudu Comment

ఈ ఏడాది కెప్టెన్‌గా రోహిత్‌నే కొనసాగాలి..’ వచ్చే ఏడాది హార్దిక్‌కి బాధ్యతలు అప్పగించాల్సింది. ముంబై జట్టు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత టీ20 జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా ఉన్నాడు. ముంబై జట్టులో అందరూ స్టార్లే. ఈ జట్టుకు కెప్టెన్‌గా నిలవడం అంత సులభం కాదు. చాలా ఒత్తిడి ఉంటుంది’ అని రాయుడు(Ambati Rayudu) చెప్పాచెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రోహిత్ శర్మను చూడాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. రోహిత్ మరో ఐదు-ఆరెళ్లు ఆడగలడని, అతడిని సీఎస్‌కే పొందడం మంచిదని చెప్పాడు.

రోహిత్ ముంబై జట్టుకు 10 ఏళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు ఐదు టైటిళ్లను అందించాడు. రోహిత్‌ను తప్పించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ భార్య రితికా కూడా సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోహిత్ హార్దిక్ కెప్టెన్సీలో ఆడతాడా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. కొద్ది రోజుల్లో తెలియనుంది.

Also Read : Vande Bharat Express : రేపు ప్రధాని చేతుల మీదుగా ఏపీలో 3వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!