Ambedkar : కోట్లాది ప్రజలకు స్పూర్తి అంబేద్కర్
ప్రపంచ వ్యాప్తంగా ఘనమైన నివాళులు
Ambedkar : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ప్రపంచ వ్యాప్తంగా నివాళులు అర్పించారు. 65 ఏళ్ల వయసులో డిసెంబర్ 6న లోకాన్ని వీడారు. కోట్లాది మందిని ప్రభావితం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు ప్రయత్నం చేశారు. ఆయన ప్రభావం లేకుండా ఏ అంశం లేని పరిస్థితి . ఈ దేశంలో స్వేచ్ఛ లభించిన తర్వాత తొలి న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. లెక్కలేనన్ని డిగ్రీలు ఆయన పొందారు.
Ambedkar Inspiration for Young People
ఏప్రిల్ 14న 1891లో పుట్టారు. కులం దళిత సామాజిక వర్గం. రిపబ్లికన్ పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని పేరు పొందిన కొలంబియా, లండన్ యూనివర్శిటీలలో చదువుకున్నారు. ఆర్థిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా, సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు బాబా సాహెబ్ అంబేద్కర్. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ప్రయత్నం చేశాడు. చివరి శ్వాస వరకు పోరాడాడు .
న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్తాలలో పరిశోధనలు చేశారు అంబేద్కర్(Ambedkar). న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థిక వేత్తగా పని చేశాడు. పత్రికల ప్రచురణ, దళితుల సామాజక రాజకీయ హక్కులు, రాజ్యాంగ వ్యవస్థాపనల కోసం కృషి చేశారు . డిసెంబర్ 6న పరమ పదించారు.
Also Read : Revanth Reddy Viral : సీఎం రేవంత్ రెడ్డి వైరల్