CM KCR Ambedkar : విగ్ర‌హం కాదు చైత‌న్యం..విప్ల‌వం

విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో సీఎం కేసీఆర్

CM KCR Ambedkar : సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హం కాద‌ని అది స్పూర్తి దాయ‌క‌మ‌ని, ఓ విప్ల‌వ‌మ‌ని పేర్కొన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని హుస్సేన్ సాగ‌ర్ వ‌ద్ద దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏకంగా 125 అడుగుల నిర్మించిన భారీ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ తో క‌లిసి సీఎం కేసీఆర్(CM KCR Ambedkar) ఆవిష్క‌రించారు.

అంబేద్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా తాము పాల‌న కొన‌సాగిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇది ఆకారానికి ప్ర‌తీక కాద‌ని ఇది తెలంగాణ రాష్ట్ర క‌ల‌ల‌ను సాకారం చేసే క‌ర‌దీపిక అని పేర్కొన్నారు కేసీఆర్. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ హృద‌య పూర్వ‌కంగా జై భీమ్ తెలియ చేస్తున్నాన‌ని అన్నారు. ప్ర‌తి ఏటా అంబేద్క‌ర్ జ‌యంతి నిర్వ‌హిస్తున్నామ‌ని , పాట‌లు ప‌డుతున్నాం, ఆట‌లు ఆడుతున్నాం..ఆక్రోషాన్ని తెలియ చేస్తున్నాం..ఇలా శ‌తాబ్దాలు గ‌డిచి పోయినా అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం మాత్రం మ‌రిచి పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇవాళ యావ‌త్ దేశానికి దిశా నిర్దేశం చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది. భారీ విగ్ర‌హం ఏర్పాటుతో మ‌రోసారి తెలంగాణ త‌న‌దైన మార్క్ ను ఏర్పాటు చేసింద‌న్నారు. ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున విగ్ర‌హం నెల‌కొల్ప‌లేద‌ని అన్నారు సీఎం కేసీఆర్(CM KCR).

అంబేద్క‌ర్ ఒక ఊరికో..తాలూకాకో..జిల్లాకో..రాష్ట్రానికో..దేశానికో చెందిన వ్య‌క్తి కాదు ఆయ‌న విశ్వ మాన‌వుడు అంటూ కితాబు ఇచ్చారు.

Also Read : భారీ అంబేద్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ

Leave A Reply

Your Email Id will not be published!