Mayawati : రాజ్యాంగ స్పూర్తి ప్రదాత అంబేద్కర్
యూపీ మాజీ చీఫ్ మాయావతి
Mayawati : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్పూర్తి ప్రదాత అని పేర్కొన్నారు యూపీ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కుమారి మాయావతి. డిసెంబర్ 6 అంబేద్కర్ వర్దంతి సందర్భంగా ఆమె నివాళులు అర్పించారు. దేశంలో అరాచకం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ తీరని ద్రోహం తలపెడుతున్నారంటూ ఆరోపించారు. ఇలాంటి భారతాన్ని ఎన్నడూ అంబేద్కర్ కోరుకోలేదన్నారు మాయావతి.
విచారకరం, ఆందోళనకరమని పేర్కొన్నారు మాజీ సీఎం. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగంలోని పవిత్ర సూత్రాల ప్రకారం ప్రభుత్వాలు పని చేసి ఉంటే కోట్లాది మంది పేదలు అనేక సమస్యల నుంచి విముక్తి పొంది ఉండేవారని అన్నారు మాయావతి(Mayawati) . తరాలు గడిచినా ఇంకా దేశం ఇబ్బందుల్లో ఉండడం బాధాకరని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆశయాలను ప్రజల సంక్షేమం కోసం కాకుండా అమలు చేయక పోవడం వల్లనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి సంపూర్ణ ప్రజాహిత, సంక్షేమ, సమానత్వ రాజ్యాంగాన్ని అందించిన అత్యంత గౌరవనీయులైన మహోన్నత మానవుడు అంటూ అంబేద్కర్ ను కొనియాడారు మాజీ సీఎం. ఈ దేశం ఆయనకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. జీవనోపాధి, న్యాయం, శాంతి భద్రతలకు దూరమైన ప్రజలు తమ హక్కులను పొందినప్పుడే అంబేద్కర్ కు సముచితమైన నివాళి లభిస్తుందని పేర్కొన్నారు మాయావతి.
ఇదిలా ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా పేరు పొందారు. ఆయన డిసెంబర్ 6, 1956లో కన్నుమూశారు. ఇక సెలవంటూ వెళ్లి పోయారు.
Also Read : అంబేద్కర్ స్పూర్తితోనే దళితబంధు