American Airlines Bans : భారత విద్యార్థిపై అమెరికా నిషేధం
తోటి ప్రయాణీకుడిపై మూత్రం పోసినందుకు
American Airlines Bans : విమాన ప్రయాణాలలో ఇటీవల తరచుగా మూత్రం పోసిన ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయి. తోటి ప్రయాణికుడిపై నిద్ర పోయిన సమయంలో మూత్రం పోసినందుకు గాను అమెరికా ఎయిర్ లైన్స్ సదరు స్టూడెంట్ పై పూర్తిగా నిషేధం విధించింది. ఈ ఘటనపై దృష్టి సారించామని , సదరు ప్రయాణీకుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక భవిష్యత్తులో అతడిని ఎక్కడా విమానంలోకి అనుమతించ బోమంటూ స్పష్టం చేసింది అమెరికా ఎయిర్ లైన్స్.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి బయలు దేరింది అమెరికన్ ఎయిర్ లైన్స్ . విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు శనివారం మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. నిందితుడిని 21 ఏళ్ల ఆర్య వోహ్రాగా గుర్తించారు. అతడు అమెరికా యూనివర్శిటీలో చదువుతున్నట్లు తేలింది. అతడిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది అమెరికన్ ఎయిర్ లైన్స్(American Airlines Bans).
ఇక యుఎస్ ఎయిర్ లైన్స్ ప్రకటన ప్రకారం జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ఫ్లైట్ ఏఏ292 కి అంతరాయం కలిగించాడు. రాత్రి 9.50 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆర్య వోహ్రా పూర్తిగా మత్తులో ఉన్నాడని, సిబ్బందితో కూడా అమర్యాదకరంగా ప్రవర్తించాడంటూ ఆరోపించింది.
ఆర్యా వోహ్రా పదే పదే ఆపరేటింగ్ సిబ్బందితో వాదనకు దిగాడు. కూర్చోడానికి ఇష్ట పడలేదు. సిబ్బంది, విమానాల భద్రతకు ఆటంకం కలిగించాడు. 15జిలో కూర్చున్న పాక్స్ పై యూరిన్ పోశాడని తెలిపింది యుఎస్ ఎయిర్ లైన్స్.
Also Read : వ్యాపారాలకు భారత్ గమ్యస్థానం