Amit Shah : మునుగోడు స‌భ‌కు ట్ర‌బుల్ షూట‌ర్

భారీ జ‌న స‌మీక‌ర‌ణ‌లో బీజేపీ ఫోక‌స్

Amit Shah : ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఆదివారం తెలంగాణ‌కు రానున్నారు. ఆయ‌న ముందుగా హైద‌రాబాద్ లోని మ‌హంకాళి అమ్మ వారిని ద‌ర్శించుకుంటారు.

అనంత‌రం న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు లో జ‌రిగే బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌వుతారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కింది.

ఇక్క‌డ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యం కానుంది.

ఇప్ప‌టికే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించ‌డం చ‌క‌చకా జ‌రిగి పోయింది. గ‌త కొన్నేళ్లుగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో కాంగ్రెస్ , క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌గా ఉంటూ వ‌చ్చింది.

ఇన్నేళ్లుగా ఈ మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో కేవ‌లం ఒకే ఒక్క‌సారి మాత్ర‌మే టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజీనామాతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయాలు వేడిని రాజేస్తున్నాయి.

శ‌నివారం ఇదే వేదిక‌గా టీఆర్ఎస్ చీఫ్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌భ‌ను చేప‌ట్టారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారు.

ఈ త‌రుణంలో ట్ర‌బుల్ షూట‌ర్ రానుండ‌డంతో బీజేపీ నాయ‌క‌త్వమంతా మ‌నుగోడుపై ఫోకస్ పెట్టింది. భారీ ఎత్తున జ‌నాన్ని త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మ‌ధ్యాహ్నం జ‌రిగే స‌భ‌లో గంట‌న్న‌ర‌కు పైగా ఉంటారు అమిత్ షా. మ‌రో వైపు రూ. 5, 000 వేల కోట్లు ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Also Read : మోదీ అహంకారం దించ‌డం ఖాయం – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!