Amit Shah : ఆర్మూర్ – రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి కేరాఫ్ గా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబంపై విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆర్మూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ జెండా సకల జనులకు అండగా నిలుస్తుందన్నారు.
Amit Shah Slams BRS Govt
దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు. తెలంగాణ సమగ్రమైన అభివృద్ది చెందాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యం అవుతుంందని స్పష్టం చేశారు అమిత్ షా(Amit Shah). ఏ పార్టీ ఇవ్వలేని విధంగా ఇవాళ ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు మోదీ ముందుకు వచ్చారని గుర్తు చేశారు.
అంతులేని అవినీతి, అక్రమాలకు పాల్పడిన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీకి ఉందన్నారు. వారి అవినీతి చిట్టా తప్పక తీస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వారికి ఓ ఏటీఎం లాగా మారిందని ఆరోపించారు. కరప్షన్ కు అలవాటు పడిన వారిని తన కేబినెట్ లో మంత్రులుగా చేర్చుకున్నారంటూ మండిపడ్డారు అమిత్ షా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అక్రమాలకు పాల్పడిన వారిని జైల్లోకి వేస్తామన్నారు.
Also Read : Mynampally Hanumanth Rao : కేటీఆర్ బచ్చా జర జాగ్రత్త