Amit Shah: పీవోకే విలీనంపై అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు !

పీవోకే విలీనంపై అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు !

Amit Shah: కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోనికి వస్తుందని… బీజేపీ అధికారంలోనికి వచ్చిన వెంటనే భారత్‌ లో పీవోకే విలీనం ఖాయమని కేంద్ర మంత్రి అమిత్‌ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేసారు. ఖచ్చితంగా పీవోకే మన దేశంలో విలీనం అవుతుందని ఆయన స్పష్టం చేసారు. హరియాణాలోని కర్నల్‌ లో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న షా… కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Amit Shah Comment

‘‘జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’ను కాంగ్రెస్‌ తన హయాంలో రద్దు చేయలేకపోయింది. అందుకు కారణం బుజ్జగింపు రాజకీయాలే. అక్కడ ఉగ్రవాద చర్యలు పెరిగిపోయినప్పటికీ అడ్డుకోలేపోయింది. కానీ, మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఆర్టికల్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం కశ్మీర్‌ లో మన త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. మళ్లీ వచ్చేది మోదీ సర్కార్‌. త్వరలో పీవోకే భారత్‌లో విలీనం అవుతుంది’’ అని అమిత్‌ షా అన్నారు.

మైనారిటీ ఓటు బ్యాంకును పొందేందుకే కాంగ్రెస్‌ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనలేదని షా ఆరోపించారు. ‘‘ఖర్గే జీ.. మీరు ఎనిమిది పదుల వయసులో ఉన్నా.. దేశ పరిస్థితి గురించి సరిగా అర్థం చేసుకోలేపోయారు. కానీ, హరియాణా యువత కశ్మీర్‌ కోసం తమ ప్రాణాలు ఇవ్వగలరు’’ అని విమర్శించారు.

Also Read : Lok Sabha Elections: ముగిసిన అయిదో దశ ఎన్నికల పోలింగ్‌ !

Leave A Reply

Your Email Id will not be published!