Amit Shah : అమిత్ షా డీప్ ఫేక్ వీడియోల కేసులో నలుగురు తెలంగాణ వాసులకు నోటీసులు
కాగా, రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్రమంత్రి అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియో కాంగ్రెస్ హల్ చల్ చేసింది....
Amit Shah : కేంద్ర మంత్రి అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రిజర్వేషన్ పేరుతొ అమిత్ షా డీప్ ఫేక్ వీడియోలు సృష్టించినందుకు గాను పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్‌ను సంప్రదించారు. సెక్షన్ 91 ప్రకారం నోటీసులు జారీ చేస్తామని అధికారులు గాంధీభవన్ నేతలకు తెలియజేశారు.అయితే ఈ ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు అందగా, వారిలో నలుగురు తెలంగాణకు చెందిన వారున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి మానే సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Amit Shah Deep Fake Video…
కాగా, రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) పేరుతో ఓ ఫేక్ వీడియో కాంగ్రెస్ హల్ చల్ చేసింది. భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ (IFSO) నకిలీ వీడియో సృష్టికర్తపై దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్‌ను సందర్శించి సంబంధిత సోషల్ మీడియా సిబ్బందికి సమాచారం అందించారు. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలు రూపొందించే వారిని కఠినంగా శిక్షిస్తామని కర్ణాటక సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖంగా హెచ్చరించారు.
Also Read : CM Revanth Reddy : కర్ణాటక పర్యటనలో మోదీ పై తీవ్రంగా విరుచుకుపడ్డ తెలంగాణ సీఎం