Amit Shah National Flag : ఇంటిపై జెండాను ఎగరేసిన అమిత్ షా
కేంద్ర మంత్రితో పాటు భార్య కూడా
Amit Shah National Flag : దేశ వ్యాప్తంగా మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది.
ఇదే సమయంలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హర్ ఘర్ తిరంగా పేరుతో దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు ప్రధాని.
ఇందులో భాగంగా శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah National Flag) తన నివాసంపై భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ఆయనతో పాటు అమిత్ షా సతీమణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు జాతీయ భావాన్ని కలిగి ఉండాలని, దేశం పట్ల నిబద్దులై కంకధారులు కావాలన్నారు అమిత్ షా. దేశ మంతటా ఆగస్టు 13 నుంచి పంధ్రాగస్టు దాకా తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఆవిష్కరించాలని కోరారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో హర్ ఘర్ తిరంగా ఒక భాగం. అంతే కాకుండా ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను కూడా జాతీయ జెండాలతో మార్చాలని కోరారు.
దీంతో పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలతో అలరారుతోంది సామాజిక మాధ్యమం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల స్పూర్తి ప్రపంచానికి చాటాలని, అది దేశానికి గర్వ కారణంగా నిలవాలని ఆకాంక్షించారు ట్రబుల్ షూటర్ కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా.
ఇందులో భాగంగా గతంలో ఉన్న నిబంధనలను సడలించింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ జెండా ఎగుర వేసేందుకు కొన్ని నియమాలను పొందు పర్చింది.
ఆ మేరకు ఇప్పటికే దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
Also Read : అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సీఎం ఓకే