Amit Shah : నా వాయిస్ లోనే ఏదో లోపం ఉంది

అమిత్ షా ఆస‌క్తిక కామెంట్స్

Amit Shah : ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా (Amit Shah) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఎలాంటి కోపం లేద‌ని, త‌న వాయిస్ లోనే ఏదో లోపం ఉందేమోన‌న్న అనుమానం వ్య‌క్తం చేశారు.

పార్ల‌మెంట్ లో స‌భ్యులు ప‌దే ప‌దే అభ్యంత‌రాన్ని తెల‌ప‌డంపై ఆయ‌న పై విధంగా వ్యాఖ్యానించారు. తాను కోప‌గించు కోవ‌డం అన్న‌ది ఉండ‌ద‌ని, మీరు కాశ్మీర్ కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని కోరారు అమిత్ షా.

తాను ఎవ‌రిని దూషించ లేద‌న్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల రెండో విడ‌తలో ప్ర‌సంగించారు. ట్ర‌బుల్ షూట‌ర్ చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా సభ‌లో న‌వ్వులు విరిశాయి.

ఎలాంటి ప్ర‌శ్న‌లు మీరు సంధించినా తాను చెప్పేందుకు రెడీగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో ప్ర‌స్తుతం శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు లేవ‌న్నారు. అంతా కంట్రోల్ లోనే ఉంద‌న్నారు.

క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర్ – ఐడెంటిఫికేష‌న్ బిల్లు 2022 గురంచి ప్ర‌స్తావించారు. నేర ప‌రిశోధ‌న‌ను స‌మ‌ర్థ‌వంతంగా, వేగ‌వంతంగా చేయ‌డం , నేరారోప‌ణ రేటును త‌గ్గించ‌డం ఈ బిల్లు ల‌క్ష్యమ‌ని పేర్కొన్నారు అమిత్ షా(Amit Shah).

గోప్య‌తో హ‌క్కుతో స‌హా బిల్లుపై ప్ర‌తిప‌క్ష స‌భ్యుల భ‌యాన్ని త‌గ్గించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా టీఎంసీ ఎంపీ లైట‌ర్ సిర‌లో అమిత్ షా పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆయ‌న ప్ర‌తిదానికి కోపం తో స‌మాధానం ఇస్తున్నారంటూ వాపోయారు. దీంతో షా తీవ్రంగా స్పందించారు. ఇదిలా ఉండ‌గా ఈ బిల్లును హోం శాఖ స‌హాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు.

Also Read : మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్..డీజిల్ ధ‌ర‌లు

Leave A Reply

Your Email Id will not be published!