Amit Shah : బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయం
నిప్పులు చెరిగిన అమిత్ చంద్ర షా
Amit Shah : హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. నవంబర్ 30న జరిగే పోలింగ్ లో బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
Amit Shah Serious Comments on KCR
మీ నిర్ణయం ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే కోసమో కాదన్నారు. మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును , దేశ ఫ్యూచర్ ను ప్రభావితం చేస్తుందన్నారు అమిత్ షా. చైతన్యవంతమైన ఓటర్లు , ప్రజలు బీజేపీకి, మోదీకి అండగా ఉంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
మియాపూర్ భూ కుంభకోణం , మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ , మద్యం స్కామ్, గ్రానైట్ స్కామ్ లలో కేసీఆర్ ప్రభుత్వం పీకల లోతు దాకా కూరుకు పోయిందని ఆరోపించారు అమిత్ చంద్ర షా.
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు డబుల్ బెడ్రూమ్ , దళిత బంధు పథకాల్లో చేతి వాటం ప్రదర్శించారని మండిపడ్డారు. ఫిల్మ్ సిటీ, ఫార్మా సిటీ, టెక్స్ టైల్ సిటీ, ఎడ్యూకేషన్ సిటీ వంటి హామీలన్నీ నీళ్ల మీద రాతలేనని తేలి పోయిందని ఎద్దేవా చేశారు. తాము ఏం చెప్పామో అదే చేసి చూపించామన్నారు. రామ మందిరం అయినా, ట్రిపుల్ తలాక్ అయినా, ఆర్టికల్ 370 అయినా రద్దు చేస్తామని తెలిపామని , అదే చేశామన్నారు.
Also Read : Yogendra Yadav : మార్పు తథ్యం హస్తం వైపు జనం