Amit Shah : కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా కన్నెర్ర
బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది
Amit Shah : కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) . ఇవాళ ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలపడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
శుక్రవారం అమిత్ షా మీడియాతో మాట్లాడారు. వాళ్లు చేపట్టిన ఈ ఆందోళన పూర్తిగా రామ మందిరం శంకుస్థాపనకు వ్యతిరేకంగా జరిగినట్లు భావించాల్సి వస్తుందన్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు అమిత్ షా. ఇదిలా ఉండగా మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.
కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ , తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఆరు గంటల పాటు దేశ రాజధాని లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
భారీ ఎత్తున చేరుకున్న పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ నిలిపి వేశారు. వాళ్లకు ఎలాంటి ఎజెండా లేదన్నారు అమిత్ షా(Amit Shah) . కాక పోతే ఏదో రహస్య ప్లాన్ ఉందని తనకు అనుమానం కలుగుతోందన్నారు కేంద్ర మంత్రి.
ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎవరినీ పిలిపించ లేదు. ఎవరినీ ప్రశ్నించ లేదు. దాడులు జరగలేదన్నారు అమిత్ షా. హఠాత్తుగా ఎందుకు ఇవాళ నిరసన చేపట్టిందని ప్రశ్నించారు.
కావాలని తమను బద్ నాం చేసేందుకే ఇలా చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదని అన్నారు.
Also Read : ప్రజాస్వామ్యానికి సమాధి రాచరికానికి పునాది