Amit Shah : 28న అమిత్ చంద్ర షా రాక
తెలంగాణపై బీజేపీ ఫోకస్
Amit Shah : హైదరాబాద్ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తెలంగాణకు రానున్నారు. ఈనెల 28న పర్యటించనున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు. తాజాగా శాసన సభ ఎన్నికలు ముగిశాయి. ఊహించని రీతిలో బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. ఇదే సమయంలో పెద్ద ఎత్తున ఓట్ల శాతం పెరిగింది. ఇదే సమయంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎలాగైనా సరే క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది బీజేపీ.
Amit Shah Telangana Tour
పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు అమిత్ చంద్ర షా(Amit Shah). అభ్యర్థులను ఎంపిక చేయడం, గెలుపు అవకాశాల గురించి ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి చర్చించారు షాతో.
బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఎంపీలుగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. పలువురు నేతలను ఎంపీలుగా బరిలోకి దించే ఛాన్స్ ఉంది.
లక్ష్మణ్ ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 17 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు ట్రబుల్ షూటర్ అమిత్ షా.
Also Read : Ram Mandir Doors : హైదరాబాద్ లో రామ మందిరం తలుపులు