Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ చంద్ర షా (Amit Shah ) గురువారం పశ్చిమ బెంగాల్ లో కాలు మోపారు. 2021లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన ఇదే మొదటిసారి రావడం ఇక్కడికి.
ఆయన రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఉత్తర బెంగాల్ లోని సిలిగురి పట్టణంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గంంటారు. అనంతరం దక్షిణ బెంగాల్ లో బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిర్వహించే కార్యక్రమానికి హాజరు కానున్నారు. యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో దుర్గా పూజను చేర్చినందుకు గాను ఈనెల 6న విక్టోరియా మెమోరియల్ హాలులో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.
పార్టీ శ్రేణులు, నాయకులతో ములాఖత్ అవుతారు. రాష్ట్రంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతం పై చర్చిస్తారు.
ఇదిలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కోల్ కతా తూర్పు శివారు లోని హోటల్ లో షా రాష్ట్ర ఉన్నతాధికారులు, శాఖాధిపతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అవుతారని బీజేపీ పార్టీ వెల్లడించంది.
గత ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లు గెలిస్తే టీఎంసీ 211 సీట్లు విజయం సాధించి సత్తా చాటింది. ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రెండు అసెంబ్లీ స్థానాలు , ఐదుగురు భారతీయ జనతా పార్టీకి రాజీనామాలు చేయకుండానే టీఎంసీలో చేరారు.
మాజీ రాష్ట్ర చీఫ దిలీప్ ఘోష్ తన వారసుడు సుకాంత మజుందార్ ను అనుభవం లేని నాయకుడంటూ కామెంట్ చేశాడు. అమిత్ షా టూర్ తో ఏం జరగనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : ‘చాలీసా’కు లౌడ్ స్పీకర్లు ఎందుకు