Amnesia Pub Case : గ్యాంగ్ రేప్ కేసులో మైన‌ర్ల‌కు బెయిల్

సంచ‌ల‌నం సృష్టించిన మైన‌ర్ బాలిక రేప్

Amnesia Pub Case : అంతా అనుకున్న‌ట్టే జ‌రిగింది. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. గ‌తంలో రేప్ కు పాల్ప‌డిన వారిని ఎన్ కౌంట‌ర్ చేసిన పోలీసులు బ‌డా బాబుల పిల్ల‌ల‌ని వ‌దిలేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

వీళ్లు మైన‌ర్ల‌ని అందుకే వీరిని జువైన‌ల్ కు త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిపారు. తాజాగా విప‌క్షాలు ఆరోపించిన‌ట్లుగానే అమ్నీషియా ప‌బ్ కేసు(Amnesia Pub Case) దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.

ఈ ఘ‌ట‌న‌లో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మైన‌ర్ సామూహిక రేప్ కేసులో ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. ఘ‌ట‌న జ‌రిగి 48 రోజుల త‌ర్వాత న‌లుగురు మైన‌ర్ల‌కు బెయిల్ మంజూరు చేసింది జువైన‌ల్ జ‌స్టిస్ బోర్డు.

మైన‌ర్ల బెయిల్ పిటిష‌న్ల‌ను రెండు సార్లు తిర‌స్క‌రించింది ఇదే బోర్డు. కానీ ఈసారి మాత్రం ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఒక్కో మైన‌ర్ రూ. 5 వేల పూచీ క‌త్తుపై బెయిల్ ఇస్తున్న‌ట్లు తెలిపింది.

కేసుకు సంబంధించి విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని , హైద‌రాబాద్ డీపీఓ ముందు ప్ర‌తి నెలా హాజ‌రు కావాల‌ని జువైన‌ల్ బోర్డు ఆదేశించింది. ఈ రేప్ కేసులో ఏ1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ కు బెయిల్ రాలేదు.

మ‌రో మైన‌ర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి ఇంకా బెయిల్ ల‌భించ లేదు. దీనిని స‌వాల్ చేస్తూ హైకోర్టులో బెయిల్ కోసం అప్పీలు చేసుకున్నాడు. ఇంకా పెండింగ్ లో ఉంది.

సాదుద్దీన్ మాలిక్ ను చంచ‌ల్ గూడ జైలులో ఉంచారు. 17 ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Also Read : ఎయిర్ పోర్ట్ లో బిష‌ప్ కు బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!