Amritpal Singh Posters : పంజాబ్ లో అమృత్ పాల్ పోస్టర్లు
సమాచారం ఇస్తే భారీ నజరానా
Amritpal Singh Posters : ఓ వైపు ఢిల్లీ స్పెషల్ టీం మరో వైపు పంజాబ్ పోలీసులు ఒకే ఒక్కడి కోసం తెగ గాలిస్తున్నారు. వందలాది పోలీసు బృందాలను కళ్లు గప్పి చెక్కేశాడు ఖలిస్తాన్ వేర్పాటు వాద మద్దతుదారు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్. ఇటీవలే సింగ్ అనుచరుడు, మెంటర్ గా పేరొందిన ప్రపుల్ ప్రీత్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.
అతడిని అస్సాం జైలుకు తరలించారు. ఈనెల 14న బైసాఖి ఫెస్టివల్ జరగనుంది. సిక్కులంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు అమృతపాల్ సింగ్. బటిండాలో పెద్ద ఎత్తున పోలీసులు కట్టుదిట్టమై భద్రత ఏర్పాటు చేశారు.
గత నెల మార్చి 18న ఖాకీల కళ్లు గప్పి పారి పోయాడు. ఆపై ఓ వీడియోను కూడా విడుదల చేశాడు. తాను వేషం మార్చనని , అవసరమైతే తల తీసుకుంటానని ప్రకటన చేశాడు. ఆపై త్వరలోనే తాను ఈ ప్రపంచం ముందుకు వస్తానని స్పష్టం చేశాడు అమృతపాల్ సింగ్. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రికి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కేంద్రం సీరియస్ గా స్పందించింది.
పంజాబ్ ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అమృతపాల్ సింగ్ (Amritpal Singh Posters) తనంతకు తాను గా బ్రింధన్ వాలే -2గా భావిస్తాడు. తాజాగా పంజాబ్ పోలీసులు అమృతపాల్ సింగ్ గురించి సమాచారం ఇస్తే వారికి రివార్డు ఇస్తామంటూ ప్రకటన చేశారు. ప్రతి చోటా పోస్టర్లు వేశారు. ప్రస్తుతం ఇవి హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : గ్యాంగ్ స్టర్ అసద్ ఎన్ కౌంటర్