Amruta Fadnavis : గవర్నర్ కు ఫడ్నవీస్ భార్య మద్దతు
ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు
Amruta Fadnavis : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ ను అవమానించాడంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగింది. ఇప్పటికీ ఇంకా ఆవేశాలు చల్లారలేదు. అంతే కాదు ఆయనను రీకాల్ చేయాలని శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.
వెంటనే కోష్యారీని ఇక్కడి నుంచి పంపించాలని కోరారు శివసేన తిరుగుబాటు వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. ఇక శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ గవర్నర్ పై నిప్పులు చెరిగారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అయితే చరిత్ర తెలియని వ్యక్తులను ఎలా గవర్నర్ గా నియమిస్తారంటూ మండిపడ్డారు.
ఈ తరుణంలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అయితే ఏకంగా గవర్నర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గవర్నర్ పై సర్వత్రా దాడి జరుగుతున్న తరుణంలో ఒకే ఒక్కరు అది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్(Amruta Fadnavis) బేషరతుగా మద్దతు పలికారు.
గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అన్నదాంట్లో తప్పేమీ లేదంటూ వెనుకేసుకు వచ్చారు. ఈ తరుణంలో మరాఠాలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ చీఫ్ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. శుక్రవారం అమృత ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తనకు వ్యక్తిగతంగా తెలుసన్నారు.
ఆయన మహారాష్ట్రకు వచ్చాక మరాఠీ నేర్చుకున్నారు. రాష్ట్ర ప్రజలంటే ఎనలేని అభిమానం ఉంది. గవర్నర్ ఏదో అన్నాడని వక్ర భాష్యం చెప్పవద్దన్నారు.
Also Read : కావాలనే జైన్ వీడియోలు బీజేపీ లీక్