Mayawati Mulayam : ఒక శకం ముగిసింది – మాయావతి
ములాయం మరణంపై బీఎస్పీ చీఫ్
Mayawati Mulayam : బీఎస్పీ చీఫ్, మాజీ సీఎం మాయావతి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి, యుపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన అతి కొద్ది మంది నాయకులలో ములాయం సింగ్ యాదవ్ ఒకరు అని పేర్కొన్నారు.
రాజకీయాల పరంగా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ సోషలిస్టు నాయకుడిగా తనదైన ముద్ర కనబర్చారని కితాబు ఇచ్చారు. ఇలాంటి నాయకులు అరుదుగా పుడతారని పేర్కొన్నారు. బీఎస్పీ, ఎస్పీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్బాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ తనకు ములాయం సింగ్ యాదవ్ అంటే వల్లమాలిన గౌరవం ఉందని తెలిపారు మాయావతి.
అటు దేశ రాజకీయాలలో ఇటు యుపీ రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బహుజనులకు సంబంధించిన విషయంలో ములాయం ఎల్లప్పటికీ గుర్తుండి పోతారని స్పష్టం చేశారు మాయావతి(Mayawati). ఒక రకంగా రాజకీయంగా శూన్యత ఏర్పడినట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రానికి, దేశానికి ముఖ్యంగా తనకు తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాయావతి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ చీఫ్ మాట్లాడుతూ ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఒక శకం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తో పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మకం. ఆ తర్వాత ఇద్దరూ విడి పోయారు.
Also Read : ములాయం సోషలిజం మూల స్తంభం – యోగి